calender_icon.png 4 October, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో మంత్రి పొన్నం పర్యటన

04-10-2025 10:43:21 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శనివారం నాడు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపన చేయనున్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇటీవల పార్టీ నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థి ఎంపికపై ఇంచార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. శనివారం సాయంత్రం వరకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కి మంత్రులు నివేదిక ఇవ్వనున్నారు. ముగ్గురి పేర్లను సూచించాలని పార్టీ ఆదేశించింది.