calender_icon.png 4 October, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ

04-10-2025 11:06:28 AM

నేడు స్పీకర్‌ విచారణకు మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి 

హైదరాబాద్: ఇవాళ మూడోరోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) విచారించనున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని(Bandla Krishna Mohan Reddy) పిటిషనర్ల తరుఫు న్యాయవాదులు ప్రశ్నించనున్నారు. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్ల విచారణ దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారనే ఆరోపణలతో భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) నాయకత్వం పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ల వేసిన విషయం తెలిసిందే.