04-10-2025 12:09:14 PM
హైదరాబాద్: సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని లోతుకుంట వద్ద సైకిల్ దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం(Fire breaks out) సంభవించింది. ఈ అగ్నిప్రమాదం ధాటికి ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.