23 August, 2026 | 1:43 AM

పార్కుల అభివృద్ధి కోసం నిరంతర కృషి

23-08-2026 12:12 AM

జంపన ప్రతాప్ 

సికింద్రాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో నియోజకవర్గంలోని వివిధ వార్డులలో 15 పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం హెచ్‌ఎండిఏ, అర్బన్ ఫారెస్ట్ శాఖల అధికారులు జంపన ప్రతాప్తో కలిసి ఆయా పార్కులను సందర్శించారు. పార్కుల స్థలాలను పరిశీలించి, కొలతలు తీసుకున్నారు.స్థానిక ప్రజలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి, వాటి ఆధారంగా అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు జంపన ప్రతాప్ కోరారు.