3 July, 2026 | 1:45 PM

సిబ్బంది కృషితోనే నిరంతర విద్యుత్

13-05-2025 01:25 AM

- లైన్‌మెన్ నుంచి సీఎండీ వరకు ఒకే యూనిఫామ్ 

- ఎస్పీడీసీఎల్ సిబ్బందితో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా క్షణం కూడా అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసే స్థాయికి రాష్ర్టం ఎదిగిందని, సిబ్బంది కుటుంబంలాగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు.

సోమవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్, మెయింటనెన్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎనర్జీ సెక్రటరీ సందీప్‌కుమార్‌సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ర్టంలో కరెంటు ఉండదని దుష్ర్పచారం చేసిన వారి కి చెంపపెట్టులాగా ఈ ఏడాది మార్చిలో 17,162మెగావాట్లకు పైగా భారీ డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం కూడా కరెంటు అంతరాయం లేకుండా సరఫరా చేశామన్నారు.

డిస్కం కంపెనీలో పనిచేస్తున్న లైన్ మెన్ నుంచి సీఎండీ వరకు ఒకేతరహా యూనిఫాం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. నిఫ్ట్‌తో డిజైన్ చేయించి దుస్తులు ఇస్తామన్నారు. న్యూ ఎనర్జీ పాలసీ తో క్లీన్‌అండ్‌గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తితో మిగులు విద్యుత్ రాష్ర్టంగా తెలంగాణ ను తీర్చిదిద్దడంతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మేస్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు.