14 April, 2026 | 8:56 PM

నాయిని.. కేసీఆర్ సోదరునిలా పనిచేశారు

13-05-2025 01:23 AM

- ఉద్యమంలో ఆయన సేవలు వెలకట్టలేనివి

- నాయిని నర్సింహారెడ్డి జయంతిలో కేటీఆర్ 

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నిలిచి, ఆయన సోదరుని పాత్ర పోషించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ నిర్ణయంపై క్షణం కూడా ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా గొప్పనేత నాయిని అని కొనియాడారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం నాయిని నర్సిం హారెడ్డి జయంతి జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ కాలంలో పార్టీ నేతలందరికీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా అనేక సేవలు అందించారని కేటీఆర్ తెలిపారు. ఉద్యమ కాలంలో అనేక కార్యక్రమాల్లో కలసి పాల్గొన్నానని, ఉద్యమంలో నమోదైన కేసులపై నాయినితో కలిసి తిరిగిన రోజులను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి నాయిని పేరు పెట్టాలని కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు.