calender_icon.png 12 November, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్

03-12-2024 10:38:55 AM

మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో ప్రభుత్వ బాలికల పాఠశాలకు ఓ కంట్రాక్టర్ తాళం వేశాడు. మన ఊరి, మన బడి ద్వారా చేసిన ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాలేదని ఎస్ఎంసీ ఛైర్మన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పాఠశాలకు తాళం వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను పాఠశాలలోనికి వెళ్లనివ్వకుండా ధర్నాకు కూర్చున్నాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. తనకు రావాల్సిన బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇస్తేనే లోపలికి అనుమతిస్తానని కాంట్రాక్టర్ ఆందోళన చేస్తున్నాడు. సమస్యను త్వరగా పరిష్కరించాలని విద్యార్థుల తల్లందడ్రులు కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.