03-12-2024 11:09:54 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): బడంగ్ పేట కార్పొరేషన్ అల్వాస్ గూడలోని 4వ డివిజన్ లో పార్కు ఆక్రమణలు హైడ్రా అధికారులు మంగళవారం తొలగించారు. వెయ్యి గజాల పార్కు స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడు. అది పార్కు స్థలమని గతంలోనే అధికారులు గుర్తించి బోర్టు ఏర్పాటు చేసినప్పటికి వ్యక్తి ఆక్రమించినట్లు అధికారులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న హైడ్రా పార్కు స్థలాన్ని పరిశీలించిన ఆక్రమణలు తొలగించి మున్సిపల్ అధికారులకు అప్పగించారు.