calender_icon.png 10 January, 2026 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడాలి

09-01-2026 12:00:00 AM

హైదరాబాద్ కలెక్టర్‌కు టీఎన్జీవోల వినతి

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరిని బుధవారం తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్ విక్రమ్‌కు మార్ నేతృత్వంలో జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్‌కుమార్, పబ్లిసిటీ సెక్రటరీ వైదిక శ్రేష్టలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో, జిల్లా యంత్రాంగం పనితీరులో కలెక్టర్ చూపిన చొరవ, అందించిన సహకారం మరువలేనివని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరారు.

ప్రధానంగా పౌరసరఫరాల శాఖకు సంబంధించి సొంత భవనాలు లేక సర్కిల్ కార్యాలయాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గోషామహల్ పరిధిలో అందుబాటు లో ఉన్న ఖాళీ ప్రభుత్వ భవనాన్ని సదరు కార్యాలయాలకు కేటాయించాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ , ప్రజలకు సేవలను మరింత చేరువ చేసే క్రమంలో మెహదీపట్నం, నాంపల్లి సర్కిల్ కార్యాలయాలకు తక్షణమే ప్రభుత్వ భవనాలను కేటాయించేందుకు హామీ ఇచ్చారు.