calender_icon.png 10 January, 2026 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలి

09-01-2026 12:00:00 AM

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి 

మేడ్చల్, జనవరి 8 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం లబ్ధిదారులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ కవర్ కాని వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన వారందరికీ సీఎం సహాయ నిధి అందేలా తన వంతు కృషి చేస్తానని అన్నా రు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు చెక్కులు మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మల్కాజిగిరి శ్రీ సాయి నగర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు ఒగ్గు మల్లేష్ కురుమ, ముఖ్య సలహాదారు గవ్వల యాదగిరి కురు మ, ఉగ్గు సత్తయ్య కురుమ, ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం కురుమ, శ్రీధర్ కురుమ, ప్రధాన కార్యదర్శి కానుగంటి ఉపేందర్ కురుమ, సహాయ కార్యదర్శి ధనుంజయ కురుమ తోపాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.