calender_icon.png 11 January, 2026 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్చకులందరికీ సమాన వేతనం ఇవ్వాలి

09-01-2026 12:00:00 AM

అర్చక జేఏసీ డిమాండ్

కొమురవెల్లి, జనవరి 8 : దేవాలయాలలో పనిచేసే అర్చకులు అందరికీ సమాన వేతనంతో పాటు పింఛన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షులు, కన్వీనర్లు గంగు ఉపేంద్ర శర్మ, డివిఆర్ శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కొము రవెల్లి మల్లన్న క్షేత్రంలో గల టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక ఉద్యోగుల సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారు మా ట్లాడుతూ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులకు వేతన వ్యత్యాసాలు ఉన్నాయని అందరికీ సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

దేవాలయాల మునగడకు, ఆధ్యాత్మిక వైభవానికి మూల స్తంభాలైన అర్చకులు పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని వారు కో రారు. రూ 1,500 నుండి 6,000  రూపాయల వేతనాలతో అర్చకులు కాలం వెళ్లదీ స్తున్నారన్నారు. దేవాదాయ శాఖ చట్ట సవరణ చేసి ఒకే శాఖ ఒకే వేతనం అమలు చే యాలని పేర్కొన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేటి యుగంలో ఈ వేతనాలు ఏ మూలకు సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో నెంబర్ 577 ప్రకారం 5625 మంది అర్చకులకు గ్రాంట్ ఎయిడెడ్ వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించారు. 577 జీవోకు అమలుకు అడ్డంకి గా ఉన్న 121 జీవోను రద్దుచేసి, 577 జీవో పూర్తిగా అమలు చేసి తమన ఆదుకోవాలని వారు కోరారు. 0/0 పద్దుల కింద ట్రెజరీ ద్వారా వేతనాలను అందించాలని కోరారు. తాము ఎవరితోనూ వివాదాలు కోరుకోవ డం లేదని,  తమ న్యాయమైన వాటాతోపాటు గౌరవ ప్రధానమైన జీవితాన్ని కోరుకుంటున్నామని తెలిపారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి పాల కమండలి చైర్మన్ గంగం నరసింహారెడ్డి మాట్లాడుతూ అర్చకుల సమస్యలను దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ఆలయాల అర్చకులతో పాటు స్థానికార్ఛకులు మా హదేవుని మల్లికార్జున్, చిన్న మల్లికార్జున్, సాంబయ్య పాల్గొన్నారు.