విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూం
21-08-2024 02:39 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): గ్రేటర్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సంబంధిత సమస్యలపై ఎస్‌పీడీసీఎల్ అధికారులు సర్కిళ్లవారీగా కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేసినట్టు ఎస్‌పీడీసీఎల్ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో మూడు జోన్లు, 10 సర్కిళ్లకు ఈ నంబర్లను కేటాయించారు. హైదరాబాద్ మెట్రోజోన్ పరిధిలో.. హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, రంగారెడ్డి జోన్ పరిధిలో.. సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్ జోన్ పరిధిలో.. హబ్సిగూడ, మేడ్చల్, సంగారెడ్డి సర్కిళ్ల పరిధిలో ఈ కింది నంబర్లకు ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు తెలిపారు.







