29 July, 2026 | 9:39 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

రైతులకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్

30-05-2026 09:23 PM

- మునుగోడులో జీవో ప్రతుల దహనం

మునుగోడు,(విజయక్రాంతి): రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజా రామచంద్రం అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించి రైతు వ్యతిరేక జీవో ప్రతులను దహనం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పార్లమెంటులో రైతులు పండించే ప్రతి పంటకు చట్టబద్ధమైన మద్దతు ధరను అమలు చేయాలని, అలాగే రైతు సంక్షేమానికి సంబంధించిన స్వామినాథన్ కమిటీ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.