బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి
- కలెక్టరేట్ లో మాక్ పార్లమెంట్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మహిళా వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్నేహ కిషోర బాలికల మాక్ పార్లమెంట్ కార్యక్రమం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలని, సామాజిక సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. మాక్ పార్లమెంట్‌లో బాలికలు రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకురాలు వంటి పాత్రలు పోషిస్తూ ప్రజాస్వామ్య విధానాలపై అవగాహన ప్రదర్శించారు.
బాలికలు ధైర్యంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థినులకు రవాణా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కిషోర బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






