12-11-2025 12:24:36 AM
భద్రాచలం, నవంబర్ 11 (విజయ క్రాంతి) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో పుష్యమి నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి మంగళవారం నాడు ఘనంగా పట్టాభిషేకం నిర్వహించారు. హాజరైన భక్తుల సమక్షంలో అర్చకులు పట్టాభిషేకం విశిష్టత గురించి వివరించి అత్యంత వైభవపేతంగా రామయ్య పట్టాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. పట్టాభిషేక కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు.