12-11-2025 12:23:49 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, నవంబర్ ౧౧ (విజయక్రాంతి): మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, యువత ఆయన ఆలోచనలను, విలువలను అనుసరించి ముందు కు సాగాలని కలెక్టర్ అభిలాష అభినవ్‌పిలుపునిచ్చారు. మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ వైజాగ్ అమ్మతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చదువుకొని సమాజాన్ని విజ్ఞానం వైపు తీసుకెళ్లాలన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకుంటూ, స్వాతం త్రం అనంతరం భారత తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్యారంగ అభివృద్ధికి నిరంతరం శ్రమించి, అనేక సంస్కరణలను తీసుకువచ్చారని పేర్కొన్నారు.
మైనారిటీల విద్యా అభివృద్ధి, మహిళా విద్యా ప్రోత్సాహానికి ఆయన చూపిన కృషి ఎంతో విలు వైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీ వో రత్నకళ్యాణి, మైనార్టీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, డివైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.