calender_icon.png 12 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుకుంటే సమాజాన్ని జయించవచ్చు

12-11-2025 12:25:12 AM

జిల్లా లీగల్ సెల్ చైర్మన్ రాధిక

నిర్మల్, నవంబర్ ౧౧(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ చదువుకొని సమాజంలో మార్పు కోసం పని చేయాలని సీనియర్ సివిల్ జడ్జి జిల్లా లీగల్ సెల్ చైర్మన్ జి రాధిక అన్నారు. పట్టణంలోని కస్బా ఉన్నత పాఠశాలలో మం గళవారం జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్నారు. తొలి విద్యాశాఖ మంత్రి మౌలా నా అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్న ప్రాధాన్యత ను గుర్తించి అనేక ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్య హక్కు చట్టం కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు మధుసూదన్ ఎన్సిసి అధికారి ప్రసన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.