calender_icon.png 8 August, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణ

08-08-2025 12:54:06 AM

-రూ. లక్షలు విలువ చేసే ఆన్లైన్ శిక్షణ ఉచితంగా..

-ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకేకే మహేందర్ రెడ్డి  

రాజన్న సిరిసిల్ల: తంగళ్ళపల్లి,ముస్తాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు రూ. లక్షల విలువైన కార్పొరేట్ స్థాయి శిక్షణ ఉచితంగా అందిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల, బద్దెనపల్లిలోని సోషల్ వెల్ఫేర్, సారంపల్లి లోని ట్రైబల్ వెల్ఫేర్, నేరెళ్ల లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, ముస్తాబాద్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ & కళాశాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అన్  అకాడమీ ఆన్లైన్ క్లాస్ లను శుక్రవారం కేకే మహేందర్ రెడ్డి. ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, విద్య ద్వారానే మార్పుసాధ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. విద్యార్థి పాఠాలు చక్కగా విని నోట్స్ రాసుకోవాలని సూచించారు. రోజు వాటిని మరోసారి చదువుకోవాలని పేర్కొన్నారు. పాఠాల్లో ఏమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా వచ్చే టెస్ట్ సిరీస్ ను ప్రాక్టీస్ చేయాలని కలెక్టర్ తెలిపారు.

దీంతో ఐఐటీ, జే ఈ ఈ, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని నిపుణులైన టీచర్లచే పిల్లలకు బోధన జరుగుతుందని, ఢీల్లీ లో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకుని మన జిల్లాలోని విద్యార్థులకు కూడా అందిస్తున్నామని తెలిపారు.ప్రతి రోజు  కనీసం రెండు గంటల పాటు ఆన్ లైన్ కోచ్చింగ్ తీసుకోవాలని తెలిపారు. విద్యార్థి జీవితంలో 10,11,12వ తరగతులు 3 సంవత్సరాలు చాలా కీలక సమయమని, ముఖ్యమైన పాఠ్యాంశాలలో బేసిక్స్ ఇంటర్ లో ప్రారంభం అవుతాయని వివరించారు.

విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకై నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున పేదలకు నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు.

జిల్లాలో పిల్లలకు ఆన్ లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో  జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.