08-08-2025 12:51:38 AM
కొత్తపల్లి, ఆగస్టు 7 (విజయ క్రాంతి): కొత్తపల్లి లోని అల్ఫోర్స్ హైస్కూల్ (సిబిఎస్‌ఇ) ప్రాంగణంలో నిర్వహిస్తున్న టేబుల్ టెన్నిస్ పోటీలు గురువారం ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులకు గుర్తింపు లభిస్తుందని, విజయం సాధించడానికి ఆసక్తి పెంపొందించవ చ్చన్నారు. అండర్-14, 17, 19 విభాగాల్లో పలుజట్లు పోటీ పడ్డాయి. ఈ కార్యక్రమంలో కోచ్ లు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.