22 April, 2026 | 7:18 PM

Breaking News

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •  

డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు, కుక్కర్‌ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్

22-04-2026 06:12 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఐసిడిఎస్ పోషన్ పక్వాడలో  భాగంగా   కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు  కోతి రాంపూర్ సెక్టార్, పోచమ్మ వాడ అంగన్వాడి సెంటర్లో డొనేషన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్  మాసం గణేష్ కార్పోరేటర్  హాజరై  డొనేషన్ డే ను పురస్కరించుకొని  పిల్లలకు డ్రాయింగ్ బుక్స్,  స్కెచ్ పెన్నులు, అంగన్వాడి కేంద్రంలో వంటకు అవసరమైన కుక్కరును అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గణేష్ మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు  అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అంగన్వాడి కేంద్రాలు పిల్లల భవిష్యత్  కోసం ఎంతో అవసరమని, పిల్లలను క్రమంగా  అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల పనితీరు  అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్వైజర్ ఎస్ అరుణ మాట్లాడుతూ... అంగన్వాడీలో పిల్లలు ఆటపాటల ద్వారా విద్య నేర్పిస్తారని, అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేటు  కంటే దీటుగా పనిచేస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలన అంగన్వాడి కేంద్రానికి పంపించాలని సూచించారు.   ఐసిడిఎస్ ఆధ్వర్యంలో లభిస్తున్న అన్ని రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో  అంగన్వాడి టీచర్ సరూప , ఆయా , పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు .