22 April, 2026 | 7:18 PM

Breaking News

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •  

మరోసారి మానవత్వం చాటిన సాయికృష్ణ

22-04-2026 06:09 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఊట్ల మల్లయ్యకి అత్యవసరంగా రక్తం అవసరమవగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన సాయికృష్ణ వెంటనే స్పందించి రక్తదానం చేశారు. ఇప్పటివరకు 13 సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచిన సాయికృష్ణ సమాజ సేవలో ఎప్పుడూ ముందువుంటారు. అవసరమైనప్పుడు వెంటనే స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. యువత రక్తదానంపై అవగాహన పెంపొందించి, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యవసర సమయంలో మానవత్వాన్ని చాటిన సాయికృష్ణ ని స్థానికులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, యువజన నాయకులు అభినందించారు.