21-01-2026 07:38:34 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లోని వి ఎస్ టి కాలనీ పార్కు సుందరీకరణ సీసీ రోడ్డు నిర్మాణాలు జరుగుతున్న పలు అభివృద్ధి పనులు ను నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వి ఎస్ టి కాలనీ చుట్టూ ప్రాంతాల వారికి వ్యాయామం చేసుకునేందుకు 20 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ మంజూర అయిందని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టుఆమె పేర్కొన్నారు కాలనీలోని సిమెంట్ రోడ్డు డ్రైనేజీ పనులు కూడా ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు