21-01-2026 07:41:57 PM
ట్రాక్టర్ సీజ్ డ్రైవర్‌పై కేసు నమోదు
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కనగర్తి గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్టు నమ్మదగిన సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు నిన్న రాత్రి కోనరావుపేట ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది కనగర్తి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు.
పట్టుబడిన ఇసుక ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించగా, ట్రాక్టర్ డ్రైవర్‌గా ఉన్న ఓదెల రాకేష్ కనగర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కోనరావుపేట పోలీసులు వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.