24-05-2025 12:00:00 AM
హైదరాబాద్/కామారెడ్డి, మే 23 (విజయక్రాంతి): రెండు వేర్వేరే ప్రాంతాల్లో శుక్ర వారం ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెం ట్ సిటీ ప్లానర్‌గా విఠల్‌రావు పనిచేస్తున్నా డు.
వెంకట్రావు అనే వ్యక్తి తన అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన రెండు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఏసీపీ విఠల్‌రావు రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే నాలుగు లక్షలు ఇచ్చిన వెంకట్రావు మరో నాలుగు లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి విఠల్‌రావును అదుపులోకి తీసుకున్నారు.
కామారెడ్డి కోర్టులో..
కామారెడ్డి జిల్లా కోర్టులో ఓ కేస్ విషయంలో బాధితుడి నుంచి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్‌నాయక్, కోర్టు కానిస్టేబుల్ సంజయ్ రూ.10 వేలు లంచం తీసు కుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 2018లో నమోదైన ఓ కేసును ముగించేందుకు బాధితుల నుంచి రూ.15 వేలు డిమాండ్ చేయ గా.. పదివేలకు ఒప్పందం కుదిరింది.
బాధితులు ఏసీబీ సంప్రదించడంతో వారి సూచ న మేరకు రూ.10 వేలు కోర్టు కానిస్టేబుల్ సంజయ్‌కు బాధితులు ఇచ్చారు. సంజయ్ ఆ డబ్బును కోర్టులోకి వెళ్లి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు.