మార్కెట్ షటర్ల అవినీతి బాగోతం..
- అర్హులకు అన్యాయం, అనర్హులకు షాపుల కేటాయింపు
వ్యాపారులుగా ఎంపికైన వారిలో అనర్హులే ఎక్కువ..
కలెక్టర్‌కు ఫిర్యాదు
బెల్లంపల్లి అర్బన్, జూన్ 9 : బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ సముదాయం షట్టర్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వర్గం జిల్లా కలెక్టర్ కుమా ర్ దీపక్‌కీ ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ నూతన భవన సముదాయంలోని షట్టర్ రూముల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి భాగోతం చోటుచేసుకుందనీ ఫిర్యాదీ దారులు ఆరోపించారు.
కూరగాయల మార్కెట్ నూతన భవన సముదాయంలో గల షట్టర్ రూములను లబ్దిదారులకి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ షట్టర్ రూముల లబ్దిదారుల ఎంపికలో పూర్తిగా అవకతవకలు జరిగాయనీ, పూర్వ ము ఈ మార్కెట్‌లో ఎలాంటి వ్యాపారము చేయని వారు, మార్కెట్‌కి సంబంధం లేని వ్యక్తుల పేర్లు లబ్దిదారుల జాబితాలో చేర్చా రు.
ఆ పేర్ల విషయం, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినందువలన నిజమైన లబ్దిదారులకు తీరని అన్యాయం జరిగిందనీ వాపోయారు. సంబంధం లేని వ్యక్తులను లబ్దిదారుల జాబితాలో చేర్చడంతో నిజమైన లబ్దిదారులకు రావాల్సిన వరుస క్రమంలో షాపులు కాకుండా మార్కెట్లో ఓ మూలన లభించాయనీ, ఇలా కూడా స్థానిక వ్యాపారులకు అన్యాయం జరిగిందనీ తెలిపారు.
వ్యాపారులుగా ఎంపికైన వారిలో అనర్హులే ఎక్కువగా ఉన్నారనీ వెల్లడించారు. కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం పూర్తయిన తరువాత ప్రకటించిన మొదటి, రెండవ జాబితాలో లేని పేర్లు తుది జాబితాలోకి ఎలా చేరాయనీ మున్సిపల్ సిబ్బంది తీరుపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మార్కెట్‌కు అసలు సంబంధం లేని వ్యక్తుల ఎంపిక, అవినీతిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరారు.
బెల్లంపల్లి మున్సిపల్ అధికారులు ఎంపి క చేసిన జాబితాలో మార్కెట్‌కు సంబంధం లేని గంధం సౌజన్య, పోచంపల్లి యశోద, అజ్మీర దేవి బాయ్, శివరాం నాయక్, తోకల మౌనిక పేర్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఐదుగురికి ఏ అర్హత లేకున్నా కేటాయించారన్నారు. ఈ కేటాయింపుల్లో అవినీతికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదనీ స్పష్టం చేశా రు.
ఈ అవినీతి పాల్పడిన బెల్లంపల్లి మున్సిపాలిటీ అధికారులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ విన్నవించారు. మార్కెట్ షా పుల కేటాయింపులో అవినీతి, అర్హులకు అన్యాయంపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేసినవారి లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అఫ్జల్, కాంగ్రెస్ నాయకులు, దేవసాని ఆనంద్, ఆడెపు మహేష్, తిప్పని రాయమల్లు, గోవర్ధనరావు, మాజీ కౌన్సిలర్లు బైరి శ్రీనివాస్, పొట్ల సురేష్ ఉన్నారు.
ఒకేసారి 3 నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ
మంచిర్యాల, జూన్ 9 (విజయక్రాంతి): రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒకేసారి 3 నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. రేషన్ కార్డుదారులు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సన్న బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల నుండి ఈ నెల 30వ తేదీ వరకు పొందవచ్చని తెలిపారు.
జిల్లాలో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఈ పాస్ ఇంజనీర్ల ద్వారా పరిష్కరించడం జరుగుతుందని, జిల్లాలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. తహసిల్దార్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తమ పరిధిలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తారని, జిల్లాలో ఇప్పటివరకు 43.35 శాతంతో 87 వేల 552 మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ విచ్చేయడం జరిగిందని తెలిపారు.
రేషన్ డీలర్ కానీ, కార్డుదారులు కానీ రేషన్ సన్న బియ్యం పక్కదారి మల్లించి విక్రయించినట్లయితే తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ చట్టం ప్రకారం సదరు రేషన్ డీలర్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని, రేషన్ కార్డుదారుడు విక్రయించినట్లయితే సదరు కార్డును రద్దు పరచి క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.






