23 June, 2026 | 10:06 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతిని అడ్డుకుంటా

17-02-2026 01:16 AM
  1. మూడు సంవత్సరాల వరకు అవినీతి జరగదు
  2. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి తావు లేకుండా పాలన సాగేలా చూస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 16 బిజెపి కౌన్సిలర్లను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. మూడు సంవత్సరాల పాటు అవినీతికి పాల్పడకుండా అడ్డుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడీలకు గురై సంతకాలు పెడితే బాధ్యత అధికారు లే వహించాల్సి వస్తుందని తెలిపారు. అవినీతిని అధికారులు ప్రోత్సహించవద్దని కోరారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీలో అవినీతి జరగకుండా చూస్తానన్నారు. బిజెపి అభ్యర్థులు ఓడిపోయిన స్థానాల్లో సైతం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు నూతనంగా ఎన్నికైన బిజెపి కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్, రాహుల్ గౌడ్, నరేందర్ రెడ్డి, కాసర్ల రాణి, తదితరులు పాల్గొన్నారు.