6 September, 2026 | 11:00 AM

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన కౌన్సిలర్ పద్మ

28-08-2026 | 03:24pm

భూత్పూర్, ఆగస్టు 28 : రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే(Devarakadra constituency MLA) జి. మధుసూదన్ రెడ్డి కి హైదరాబాద్ లోని తన నివాస గృహంలో భూత్పూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ కేంద్యాల పద్మ నరేందర్ శుక్రవారం రాఖీ కట్టి మిఠాయిలను తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానం, ఎన్నో విజయాలు లభించాలని ఆమె ఆకర్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రేమాభిమానాలతో నాకు రాఖీలు కట్టి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు