11 April, 2026 | 2:16 AM

కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్

13-05-2024 02:22 AM

రాజేంద్రనగర్, మే 12: నార్సింగి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పత్తి ప్రవీణ్ కుమార్ ఆదివారం పీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్‌రెడ్డి, తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జీ విజయబాబు, మైలారం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గండిపేట్ మండల అధ్యక్షుడు క్యాతం అశోక్ యాదవ్, దుడ్డు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.