ఆది శంకరాచార్య జయంతి వేడుక
జహీరాబాద్, మే 12: సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులోని సిద్ధి వినాయక ఆలయం ప్రాంగణంలో జగద్గురు ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శంకరాచార్య చిత్రపటానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్ గుప్తా, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింహులు, మేనేజర్ కృష్ణ, భక్తులు పాల్గొన్నారు.
యాదాద్రి కొండపై..
యాదాద్రి భువనగిరి, మే 12 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి కొండపై ఉన్న శ్రీపర్వతవర్ధనీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శంకరాచార్య జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ భాస్కర్‌రావు, ఉప కార్యనిర్వహణాధికారి దోర్బల భాస్కర శర్మ పాల్గొన్నారు.




