30 May, 2026 | 11:25 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద స్కూల్ సాయిల్ హెల్త్ కార్యక్రమం

25-02-2026 01:04 AM

మండల వ్యవసాయ అధికారి అనురాధ

మొయినాబాద్ ఫిబ్రవరి 24(విజయ క్రాంతి): మొయినాబాద్ మండలం చిల్కూర్ గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పాఠశాలలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద స్కూల్ సాయిల్ హెల్త్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల్లో మట్టి ఆరోగ్య ప్రాముఖ్యత, స్థిరమైన వ్యవసాయ విధానాలు, భూమి సంరక్షణపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.

రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యాలలో భాగంగా వ్యవసాయ శాఖ మరియు పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీ సునీల్ కుమార్, శ్రీ పండరి, పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం. షౌరి రాజు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు శ్రీ జి. సునీల్ కుమార్, శ్రీమతి మాధురి, శ్రీమతి పి. సునీత విద్యార్థులను ప్రోత్సహించారు.

9వ, 10వ తరగతులకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులకు మట్టి ఆరోగ్యం, మట్టి సారవంతత, మట్టి నమూనాలు సేకరణ విధానం, మట్టి పరీక్ష ప్రక్రియ, సాయిల్ హెల్త్ కార్డు ప్రయోజనాలపై వివరంగా అవగాహన కల్పించారు. సమీప రైతుల పొలాల నుండి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించడం, పరీక్ష ఫలితాల ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డులు తయారు చేసి రైతులకు అందజేయడం గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందించి, భవిష్యత్లో మట్టి ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.