2 May, 2026 | 9:45 PM

మాజీ ఎమ్మెల్యే పిటిషన్‌పై కౌంటర్ వేయండి

28-04-2024 12:00 AM

l పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): భూ కబ్జాకు సంబం ధించిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో పోలీసు లు తమ వాదనలతో కౌంటర్ దాఖ లు చేయాలని హైకోర్టు ఆదేశించిం ది. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరి ధి పుల్లూరి రామయ్యపల్లి సర్వే నం బర్ 209లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్‌తోపాటు జ్యోతి, గౌతమ్ రెడ్డిపై గత జనవరిలో పోలీసులు కేసు నమో దు చేశారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని గండ్ర హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ లక్ష్మణ్ విచారించారు. పోలీసుల కౌంటర్ నిమిత్తం విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.