కరెంట్ కోతలపై కేసీఆర్ అబద్ధాలు
l మాజీ సీఎం ఎక్స్ పోస్ట్ అవాస్తవం
l డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కరెంట్ కోతలపై మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు అసత్య ప్రచారం చేస్తున్నా రని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంటిలో విద్యుత్ సరఫ రా నిలిచిపోయిందని కేసీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ప్రకటన అవాస్త వమని శనివారం తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సందర్భం లో రెండుసార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెట్టారు. దీనిపై స్థానిక ట్రాన్స్‌కో ఎస్సీని విచారణకు ఆదేశించగా.. కేసీఆర్ ప్రకటనలో వాస్త వం లేదని తెలిసిందని భట్టి వివరించారు. కేసీఆర్ రోజూ అవాస్తవా లు, అభూతకల్పనలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఎన్నిక ల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి చిన్న విషయాల్లో దొరికిపోవడం చూస్తే జాలేస్తుందని ఎద్దే వా చేశారు. అసత్య ప్రచారాలను చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.






