2 May, 2026 | 11:09 PM

మిర్యాలగూడ కాంగ్రెస్‌లో వివాదం

28-04-2024 12:05 AM

మున్సిపల్  చైర్మన్ చేరికపై నల్లగొండ నేతల ఆగ్రహం

దీపాదాస్ సలహామేరకు వాయిదా వేసిన పార్టీ

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి):  పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. వివిధ పార్టీల్లోని అసంతృ ప్తులను పార్టీలోకి చేర్చుకోవాలని పార్టీ అధిష్ఠానం సైతం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీనీ వీడిన వారు, ఇతర పార్టీల్లోని అసంతృప్తులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అయితే నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెం దిన బీఆర్‌ఎస్ నేత, మున్సిపల్ చైర్మన్ టీ భార్గవ్, మరో 13 మంది కౌన్సిలర్ల చేరిక మాత్రం వివాదాస్పదమైంది.

శనివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో భార్గవ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా నల్లగొండ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపటికే భార్గవ్ చేరికను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక ప్రక టన విడుదల చేశారు. దీపాదాస్ మున్షీ సలహా మేరకే భార్గవ్ చేరికను నిలుపుదాల చేశామని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.