30-01-2026 09:56:04 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా గూడెప్పాడు సెంటర్ లోని ఎం.ఎం మార్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 40 కిలోల నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి మౌనిక లు నకిలీ టీ పౌడర్ ను ఎలా గుర్తించాలని డెమో నిర్వహించి వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.
నకిలీ ఆహార పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై వారు వివరించారు. నకిలీ ఆహార పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల రూరల్ సిఐ రంజిత్ రావు, శాయంపేట ఎస్సై పరమేశ్వర్, దామర ఎస్సై కొంక అశోక్ లు పాల్గొన్నారు.