calender_icon.png 30 January, 2026 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల మున్సిపాలిటీటీలో 106 నామినేషన్ దాఖలు

30-01-2026 09:53:59 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల  మున్సిపాలిటీలో  చివరిరోజు శుక్రవారం మొత్తం 106 నామినేషన్ లు దాఖలైనట్లు కమిషనర్ దండు శ్రీను తెలిపారు. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు గాను అధికార పార్టీ కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, బీఎస్పీ, సిపిఐఎం, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 73 మంది అభ్యర్థుల నుంచి 106 నామినేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ పోలీసుల బందోబస్తు లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.

నామినేషన్ల ప్రక్రియకు ఎమ్మెల్యే హాజరు. నామినేషన్ల ప్రక్రియను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వయంగా పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండడంతో ఆయన దగ్గరుండి వారిచే నామినేషన్లు వేయించారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి ఘర్షణలు అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని పోలీసులకు, ఎన్నికల సిబ్బందికి సూచించారు.