30-01-2026 09:49:10 PM
జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగియగా శనివారం స్క్రూటినీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ నుండి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
స్క్రూటినీ సందర్భంగా ఎలాంటి విషయాలను పరిశీలించాలి, గదిలోకి ఎంతమందిని అనుమతించాలి అనే విషయాలను వివరించారు. స్క్రూటినీ సందర్భంగా తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్డీఓ కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని తెలియచేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారు.