calender_icon.png 31 January, 2026 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

30-01-2026 09:41:45 PM

మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్ట మొదటి ఎన్నికల కోసం అందరు వేచి చూస్తున్నారు. శుక్ర వారం మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి తన నివాస ఆవరణలో మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేం సాగర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో మంచిర్యాల నియోజక వర్గంలో చేసిన అభివృద్దిని వివరించారు.

కార్పొరేషన్ పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని, 60 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో నియోజక వర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నానని, అనారోగ్యం నియోజక వర్గ అభివృద్ధికి ఏమాత్రం అడ్డుకాదని, రానున్న ఏడు నెలల్లో రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్థానని భరోసా ఇచ్చారు. రెండు వేల పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం తన లక్ష్యమని అన్నారు.

విద్య, వైద్యం కోసం ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు  వెళ్లే పరిస్థితి రాదని, ఇక్కడికే అందరు వచ్చేలా మంచిర్యాలలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. హాజీపూర్ మండలం గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద జాతీయ స్థాయిలో చేప పిల్లల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా వందల సంఖ్యలో, దీనిపై ఆధారపడే వేల మందికి ఉపాధికి బాటలు వేస్తామని, ఇండస్ట్రీయల్ పార్కు పూర్తి చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఓట్ల శాతం పెంచాలని ఓటర్లకు సూచించారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ ల వారిగా అభ్యర్థులను ప్రకటిస్తూ పరిచయం చేశారు.

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల అభ్యర్థులు వీరే

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో మహిళల వాటా ప్రకారం 30 సీట్లతో పాటు మరో రెండు కేటాయించినట్లు ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు వెల్లడించారు. ఇందులో 48 సీట్లను పాత వారికే కేటాయించగా, పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే 11 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చామని, ఒకటి సీపీఐకి కేటాయించినట్లు తెలిపారు. కార్పోరేషన్ మొదటి డివిజన్ అభ్యర్థిగా శ్రీపతి కవితను ప్రకటించగా రెండవ డివిజన్ అభ్యర్థిగా పుట్ట యశోద, మూడవ డివిజన్ అభ్యర్థిగా పత్తి ప్రకృతి, నాలుగవ డివిజన్ అభ్యర్థిగా అంగిడి రాజేష్, ఐదవ డివిజన్ అభ్యర్థిగా బత్తుల సరిత, ఆరవ డివిజన్ అభ్యర్థిగా మేకల అశ్విని, ఏడవ డివిజన్ అభ్యర్థిగా వేల్పుల రవీందర్, ఎనిమిదవ డివిజన్ అభ్యర్థిగా అట్కపురం సతీష్, తొమ్మిదవ డివిజన్ అభ్యర్థిగా సుర్మిళ్ల సౌమ్య, పదవ డివిజన్ అభ్యర్థిగా రాచకొండ గోపన్న, 11వ డివిజన్ అభ్యర్థిగా సుధమల్ల హరికృష్ణ, 12వ డివిజన్ అభ్యర్థిగా అర్కల హేమలత, 13వ డివిజన్ అభ్యర్థిగా రాజారావు, 14వ డివిజన్ అభ్యర్థిగా తూముల నరేష్, 15వ డివిజన్ అభ్యర్థిగా చింతపండు శ్రీను, 16వ డివిజన్ అభ్యర్థిగా బియ్యాల త్రివేణి, 17వ డివిజన్ అభ్యర్థిగా లగిశెట్టి రాజయ్య, 18వ డివిజన్ అభ్యర్థిగా రాచమల్ల కమల, 19వ డివిజన్ అభ్యర్థిగా కాకుల వరలక్ష్మీ, 20వ డివిజన్ అభ్యర్థిగా గంగవరపు వెంకటేశ్వర్లు, 21వ డివిజన్ అభ్యర్థిగా జోగుల సదానందం, 22వ డివిజన్ అభ్యర్థిగా కంకణాల రోజా, 23వ డివిజన్ అభ్యర్థిగా మజీద్, 24వ డివిజన్ అభ్యర్థిగా బొద్దు స్వప్న, 25వ డివిజన్ అభ్యర్థిగా తోట రజిత, 26వ డివిజన్ అభ్యర్థిగా కొత్త రమేష్, 27వ డివిజన్ అభ్యర్థిగా కొండ్ర రాజేశ్వరి, 28వ డివిజన్ అభ్యర్థిగా మాడిగె మల్లయ్య, 29వ డివిజన్ అభ్యర్థిగా బండారి సుధాకర్, 30వ డివిజన్ అభ్యర్థిగా కర్రె శ్రీనివాస్, 31వ డివిజన్ అభ్యర్థిగా తాళ్ల సంపత్ రెడ్డి, 32వ డివిజన్ అభ్యర్థిగా ధర్ని మధూకర్, 33వ డివిజన్ అభ్యర్థిగా ఎంబడి కుమార స్వామి, 34వ డివిజన్ అభ్యర్థిగా అగల్ డ్యూటీ రాజు, 35వ డివిజన్ అభ్యర్థిగా మర్రి శ్రీలత, 36వ డివిజన్ అభ్యర్థిగా అగల్ డ్యూటీ రాణి, 37వ డివిజన్ అభ్యర్థిగా ఎండీ ఖలీద్, 38వ డివిజన్ అభ్యర్థిగా పూదరి విజయరాణి, 39వ డివిజన్ అభ్యర్థిగా పూదరి సునిత, 40వ డివిజన్ అభ్యర్థిగా ఆది శశికళ, 41వ డివిజన్ అభ్యర్థిగా శేర్ శ్రీలక్ష్మీ, 42వ డివిజన్ అభ్యర్థిగా చిందం సత్యవతి, 43వ డివిజన్ అభ్యర్థిగా చిలువేరి జ్యోతి, 44వ డివిజన్ అభ్యర్థిగా కోమాకుల కిషన్, 45వ డివిజన్ అభ్యర్థిగా మేరుగు మహేశ్వరి, 46వ డివిజన్ అభ్యర్థిగా పెంట రజిత, 47వ డివిజన్ అభ్యర్థిగా బొల్లం భీమన్న, 48వ డివిజన్ అభ్యర్థిగా వేములపల్లి లక్ష్మీ దుర్గ, 49వ డివిజన్ అభ్యర్థిగా కల్వల జగన్ మోహన్, 50వ డివిజన్ అభ్యర్థిగా గట్టు స్రవంతి, 51వ డివిజన్ అభ్యర్థిగా నీలి స్వప్న, 52వ డివిజన్ అభ్యర్థిగా సాయిని స్రవంతి, 53వ డివిజన్ అభ్యర్థిగా నూర్జా భేగం, 54వ డివిజన్ అభ్యర్థిగా సల్ల రమ్య, 55వ డివిజన్ అభ్యర్థిగా గండ్ల సత్తమ్మ, 56వ డివిజన్ అభ్యర్థిగా నల్ల శంకర్, 57వ డివిజన్ అభ్యర్థిగా బుద్దార్థి రాంచందర్, 58వ డివిజన్ అభ్యర్థిగా సరిత ఓజా, 59వ డివిజన్ అభ్యర్థిగా మాదంశెట్టి సత్యనారాయణ, 60వ డివిజన్ అభ్యర్థిగా ఆఫ్రిన్ సుల్తానా లను ఎంపిక చేసి బీ ఫారంలు అందజేశామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీ ఫారం తీసుకొని నామినేషన్ వేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.