30-01-2026 09:23:36 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): మేడారం జాతరకు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం హాజరయ్యారు. సమ్మక్క, సారక్క లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జాతర లో మంత్రి సీతక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆప్యాయంగా పలకరించారు.