calender_icon.png 30 January, 2026 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం

30-01-2026 09:20:21 PM

మూడు రోజుల్లో రూ.. 11,16, 290 ఆదాయం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం చివరి రోజు 15 వార్డులకు  గాను  77 నామినేషన్లు దాఖలు అయ్యాయి అని కమిషనర్ రమేష్ తెలిపారు. మొత్తం మూడు రోజులకు సంబంధించి నామినేషన్లు 136 దాఖలయ్యాయని తెలిపారు. ఈ మూడు రోజులలో నేటి వరకు ఇంటి పన్నులు,నల్లా బిల్లులు మరియు సర్టిఫికేట్ ఫీజు ద్వారా  రూ.10,07,540/- ఆదాయం పురపాలక సంఘమునకు సమకూరినది. నామినేషన్ డిపాజిట్ల ద్వారా రూ. 1,08,750/-ఆదాయం వచ్చిందని. మొత్తం రూ 11,16,290/-ఆదాయం మున్సిపల్ కు సమకూరినట్లు కమిషనర్ రమేష్ తెలిపారు...