25 April, 2026 | 12:08 AM

బీజేపీతోనే దేశం సురక్షితం

10-05-2024 02:09 AM

దేశ రక్షణ కోసం బీజేపీని గెలిపించండి

బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర్‌రాజన్ 

నిజామాబాద్, మే 9 (విజయక్రాంతి): దేశం సురక్షితంగా ఉండాలంటే  బీజేపీకి ఓటేయాలని, మోదీని ప్రధాని చేయాలని మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు.  నిజామాబాద్ నగరంలో  నిర్వహించిన కార్నర్ మీటింగ్లో తమిళిసై పాల్గొన్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

అర్వింద్ నిఖార్సైన హిందుత్వ వాది అని, ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపించి దేశ సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. మరోసారి మోదీ ప్రధాని కానున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ లో పోటీలో ఉన్న కవిత ఈసారి జైల్లో ఉన్నారని, అర్వింద్‌తో పెట్టుకుంటే అలాగే ఉంటుందని తమిళిసై అన్నారు.   తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హిందువులను  బిచ్చగాళ్లుగా సంబోధించడం తగదని అర్వింద్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.