సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, దొరకుంట గ్రామ సర్పంచ్ పాలకి సురేష్
కోదాడ,(విజయక్రాంతి): సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, దొరకుంట గ్రామ సర్పంచ్ పాలకి సురేష్ అన్నారు. శుక్రవారం కోదాడ మండలంలోని దొరకుంట గ్రామంలో రిషిత డాన్స్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రంలో పేరు తెచ్చుకున గుగ్గిళ్ళ సతీష్ చారి దొరకుంటలో సమ్మర్ క్యాంప్ పెట్టడం గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరు యొక్క సమ్మర్ క్యాంపు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, ఎమ్మెస్ విద్యా సంస్థల సీఈఓ ఎస్ఎస్ రావు, వైస్ సర్పంచ్ పత్తిపాక రమాదేవి, వార్డు మెంబెర్స్ శీలం నాగమణి కోటేశ్వరరావు, పాలడుగు జాన్, దాసరి ఉమ, భద్రాజీ గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.






