calender_icon.png 6 August, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

05-08-2025 05:15:33 PM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

యూరియా అతి వినియోగంతో కలిగే నష్టాల పై రైతులకు వివరించాలి.

జిల్లాలో ఎరువులకు కొరత లేదు

కోనరావుపేటలో పలు ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ

కోనరావుపేట,(విజయక్రాంతి): ఎరువులు, పురుగు మందుల దుకాణాల నిర్వాహకులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం, గౌరీ శంకర్ ఫెర్టిలైజర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ సెంటర్లు, గోదాములలో మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రైతుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉండాలి

రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా బస్తాలను ముందుగానే తెప్పించి అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో దానికి అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచాలని,యూరియా అధిక వాడకం వలన కలిగే నష్టాలను రైతులకు వ్యవసాయ అధికారులు, దుకాణాల నిర్వాహకులు వివరించాలని ఆదేశించారు.

యూరియాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై  వివరించాలని తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక వేళ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని,సీసీటీవీ కెమెరాలు లేని గోదాములలో వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.