18-07-2025 09:02:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక వశిష్ట హై స్కూల్ ఆదర్శ్ నగర్ యందు బోనాల పండుగ ఉత్సవాలను శుక్రవారం నిర్వహించారు .ఈ సందర్భంగా విద్యార్థినిలు అమ్మవారి వేషధారణలో విద్యార్థులు పోతురాజు విన్యాసాలు చేపట్టి ఆకట్టుకున్నారు. తెలంగాణ సాంప్రదాయంలో విద్యార్థులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ బోనాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించుతు, ఈ యేడాది వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి గొల్లపల్లి మాధవి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.