27న గో ఆరాధన, గో ప్రచార ఉద్యమం
తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్‌రెడ్డి
ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఈనెల 27 గో ఆరాధన దినోత్సవం సందర్బంగా గోవును దేశమాతగా, ఆరాధ్యనీయ దేశ దేవతగా, దేశ ఔన్యత్యానికి చిహ్నంగా గౌరవింప బడాలన్న సదుద్దేశ్యంతో ’గో ఆరాధన, గో ప్రచార ఉద్యమం’ చేపట్టినట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ(జీపీ) ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఇందుకు సంబందించిన పోస్టర్ ను శుక్రవారం రంగారెడ్డి కోర్టు మాజీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, చంద్రశేఖర్, పేటం ప్రదీప్ కుమార్, రవీందర్ లతోకలసి ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సనతనాన, హిందూ కార్యకర్త న్యాయవాదులు ఒక కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు.
ఇందులో భాగంగా ఏప్రిల్ 27న గో సంరక్షణ కోసం న్యాయవాదులు, క్లయింట్లు మొదలైన వారి సంతకాల ను సేకరించి, ఆ సంతకాల వినతిపత్రాన్ని భారత రాష్ట్రపతికి, భారత ప్రధాన మంత్రికి, అన్ని రాష్ట్రాల గవర్నర్లకు, దేశంలోని ముఖ్య మంత్రులందరికీ పంపాలని నిర్ణయించారు. మద్దతు తెలుపదగిన వారు ఫోన్ : 90677 77323కు మిస్డ్ కాల్, లేదా వాట్సాప్ : 8239711008, ఇతర సమాచారానికి 9571 712140 సంప్రదించాలని అన్నారు.






