యాదగిరిగుట్టలో హైదరాబాద్ సీపీ
25-04-2026 12:00 AM
- లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సజ్జనార్
- కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
ముందుగా ధ్వజస్థంభానికి మొక్కులు చెల్లించుకున్న సీపీ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.






