12-10-2025 11:14:32 AM
తాండూరు,(విజయక్రాంతి): రూ.లక్ష విలువైన రెండు ఆవులు చోరీ అయిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్, జయరామ్ తండాల్లో గత రాత్రి జరిగింది. బాధితులు జయరామ్ తండాకు చెందిన రుద్రం నాయక్ మరియు హన్మాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రవి తెలిపిన వివరాల ప్రకారం... గత రాత్రి యధావిధిగా పశువుల కొట్టం లో ఆవులను కట్టేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తాళ్లను కోసి ఆవులను తస్కరించినట్లు తెలిపారు. అయితే జయరాం తండాలో ఓ బొలెరో వాహనం గత రాత్రి అనుమానస్పదంగా తచ్చాడినట్లు.. అదే వాహనంలో ఆవులను తరలించినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు.