12-10-2025 10:36:42 AM
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల్లోనీ భూముల కొనుగోలు కోసం ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, తహసీల్దార్ మల్లికార్జున్ తో కలిసి కోటపల్లి మండలంలోనీ బబ్బేరు చెలుక, దేవులవాడ గ్రామాల కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన పంట నష్టపోతున్న రైతుల భూముల కొనుగోలుపై రైతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల భూములను ప్రభుత్వ నిబంధన ప్రకారం ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసేందుకు, వెను వెంటనే ఆ భూములను కొనుగోలు చేసేందుకు ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.