తెలంగాణ అమరవీరులకు సీపీ ఘన నివాళి
03-06-2026 12:11 AM
హనుమకొండ, జూన్ 2(విజయ క్రాం తి): తెలంగాణ సాధనకై తమ త్యాగాలు చేసి న తెలంగాణ అమరవీరులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా ని వాళులర్పించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ హనుమకొండ అదాలత్ సెంటర్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం చేరుకొని స్తూపం వద్ద వద్ద పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరువద్దని, వారి ఆశయ సాధనకై మనమందరం కలిసి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.






