సామజిక న్యాయం ప్రాతిపదికగా ప్రజలందరికీ పంపిణీ ప్రభుత్వ లక్ష్యం
చీఫ్ విప్, తెలంగాణ శాసనమండలి పట్నం మహేందర్ రెడ్డి
వనపర్తి, జూన్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామజిక న్యాయం ప్రాతిపదికగా ప్రజలందరికీ పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తూ, సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నదని చీఫ్ విప్, తెలంగాణ శాసనమండలి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వనపర్తి జిల్లాలోని ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసి న తెలంగాణ వేడుకలకు పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అంతకుముందు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్యఅతిథి పోలీస్ శాఖ ద్వారా ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కి , పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా కలెక్టర్ కు , అదనపు కలెక్టర్లకు వివిధ శాఖల జిల్లా అధికారులకు, శాంతిభద్రతల నిర్వహణలో నిరంతరం కృషిచేస్తున్న జిల్లా ఎస్పీ కి, పోలీస్ యంత్రాంగానికి, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా పర్యావరణ అవగాహన లో ప్రతిభ చాటిన వనపర్తి జడ్.పి.హెచ్.ఎస్ గరల్స్, కొత్తకోట జడ్పీహెచ్‌ఎస్ బాలికల, పెబ్బేరు కేజీబీవీ పాఠశాలలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వనపర్తి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ మాధవి, జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు






