13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పోలీస్ సిబ్బంది సేవలు మరువం

31-03-2026 07:24 PM

- సీపీ రష్మీ పెరుమాళ్ 

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పోలీస్ విభాగంలో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది సేవలను మరువబోమని కమిషనర్ రష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సింగీతం శంకర్ రావు, సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ చాడ శ్రీనివాస్ మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా సీపీ వారికి సన్మాన పత్రం, మెమొంటో అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్ ) కుశాల్కర్, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.